News August 28, 2024
రేషన్ షాపుల్లో ఫోర్టిఫైడ్ బియ్యం: ఏపీ క్యాబినెట్

AP: రేషన్ షాపుల్లో సార్టెక్స్ బియ్యం స్థానంలో ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా రూ.330కోట్లు ఆదా అవుతుందని సమాచారం. అలాగే సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టులు, మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Similar News
News October 28, 2025
నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.
News October 27, 2025
కవిత కొత్తగా..

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.
News October 27, 2025
రావి చెట్టును ఎందుకు పూజించాలి?

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో అగ్నిని పుట్టించే ‘అరణి మధనం’లో రావి కర్రలను ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైంది కూడా ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో దైవంతో పాటు కచ్చితంగా ఈ రావి వృక్షాలకు కూడా పూజలు నిర్వహిస్తారు.


