News February 20, 2025

రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

image

TG: సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

Similar News

News November 26, 2025

ఆనంద నిలయం విశేషాలివే..

image

శ్రీవారి దర్శనంతో భక్తులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చేదే ‘ఆనంద నిలయం’. ఇది ఆదిశేషుని పడగ మీద ఉన్న ఆనంద పర్వతంపై ఉంటుంది. ఆ కారణంగానే దీనికి ఆనంద నిలయం అనే పేరు వచ్చిందని ఐతిహ్యం. తొండమాను చక్రవర్తి నిర్మించిన ఈ నిలయానికి పల్లవ రాజు విజయదంతి విక్రమ వర్మ బంగారు పూతను, వీరనరసింగదేవ యాదవరాయలు తులాభారం ద్వారా బంగారు మలామాను చేయించారు. శ్రీనివాసుడు శిలగా మారింది ఈ ఆనంద నిలయంలోనే. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 26, 2025

రాజ్యాంగం@76 ఏళ్లు

image

భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షత వహించనుండగా ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొంటారు. తొలుత రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువుతారు. తర్వాత తెలుగు, తమిళం, మరాఠీ సహా 9 భాషల్లో డిజిటల్ రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

News November 26, 2025

ప్రపంచకప్ తెచ్చిన కెప్టెన్ దీపిక గురించి తెలుసా?

image

తాజాగా అంధ మహిళలు టీ20 ప్రపంచకప్‌ విజేతలైన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని సత్యసాయి జిల్లాకు చెందిన చిక్కతిమ్మప్ప, చిత్తమ్మల కుమార్తె. కర్ణాటకలో చదివిన ఆమె 8వతరగతిలో క్రికెట్లో అడుగుపెట్టారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సెంచరీ చేశారు. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమవ్వగా అదే సమయంలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.