News January 16, 2025
వరుసగా నాలుగు రూ.100 కోట్ల సినిమాలు

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఖండ’, గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’, అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, బాబీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. ఈ నాలుగింట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News January 23, 2026
‘₹40 లక్షలు మోసం చేశాడు’.. మంధాన మాజీ ప్రియుడిపై ఫిర్యాదు

భారత క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ₹40 లక్షలు మోసం చేశారని సాంగ్లి(MH)లో విజ్ఞాన్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నజరియా అనే మూవీలో ఇన్వెస్ట్ చేయాలని, నటించే ఛాన్స్ ఇస్తానని పలాశ్ చెప్పాడు. అతడికి ₹40 లక్షలు ఇచ్చా. ప్రాజెక్టు పూర్తి కాలేదు. డబ్బు ఇవ్వమంటే పట్టించుకోలేదు’ అని పేర్కొన్నారు. అటు FIR నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.
News January 23, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (<
News January 23, 2026
ట్రంప్ కంటే మోదీ పవర్ఫుల్: ఇయాన్ బ్రెమ్మర్

US అధ్యక్షుడు ట్రంప్ కంటే మన PM మోదీయే చాలా పవర్ఫుల్ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవి మరో మూడేళ్లలో పోతుందని.. కానీ మోదీకి దేశంలో తిరుగులేని మద్దతు ఉందని పేర్కొన్నారు. దీంతో మోదీ సంస్కరణలను దూకుడుగా అమలు చేయగలరని, విదేశీ ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరని విశ్లేషించారు. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా బెటర్ పొజిషన్లో ఉన్నట్లు తెలిపారు.


