News October 3, 2025

భారీ వర్షాలకు నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

image

AP: వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని CM చంద్రబాబు ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. వరదలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో మరింత వరద పోటెత్తుతోందని వారు తెలిపారు. వానలతో నలుగురు మృతి చెందారన్నారు. పంట నష్టంపై నివేదికలివ్వాలని సూచించారు.

Similar News

News October 3, 2025

ఇథిహాసం క్విజ్ – 24 సమాధానాలు

image

1. రావణాసురుడు ‘పులస్త్య’ వంశానికి చెందినవాడు.
2. శ్రీరాముడు ‘నవమి’ తిథిన జన్మించాడు.
3. కర్ణుడిని రాధ, అధిరథుడు దత్తత తీసుకున్నారు.
4. క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశాన్ని విష్ణువు మోహినీ రూపంలో వచ్చి తీసుకున్నారు.
5. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున మనం ‘హోళీ’ జరుపుకొంటాం.
<<-se>>#mythologyquiz<<>>

News October 3, 2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

AP: సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్, జలవనరుల, విద్యుత్ శాఖ పనులు, అమృత్ పథకం 2.0 పనులకు, ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ₹15,000, అమరావతిలో SPV ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

News October 3, 2025

ఈ-కామర్స్ సైట్లలో అదనపు ఛార్జీలు.. కేంద్రమంత్రి స్పందనిదే!

image

ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు & పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు అంటూ ఎక్స్‌ట్రా ఛార్జీలను వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. దీనిపై ఓ నెటిజన్ ట్వీట్‌ చేయగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ‘COD కోసం ఈ-కామర్స్ సైట్స్ అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదులొచ్చాయి. వీటిపై దర్యాప్తు ప్రారంభమైంది. నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.