News January 25, 2025
నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల
ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
Similar News
News January 26, 2025
ఇది కర్షక ప్రభుత్వం: గవర్నర్ జిష్ణుదేవ్
TG: ప్రజా ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ‘వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం.2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశాం. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాం. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం’ అని గణతంత్ర దినోత్సవం ప్రసంగంలో వివరించారు.
News January 26, 2025
ప్రముఖ కార్డియాక్ సర్జన్ KM.చెరియన్ కన్నుమూత
ప్రముఖ కార్డియాక్ సర్జన్ KM.చెరియన్(82) కన్నుమూశారు. నిన్న బెంగళూరులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలారని, ఆస్పత్రిలో చేర్పించగా అర్ధరాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత్లో తొలి కరోనరీ ఆర్టరీ బైపాస్ శస్త్రచికిత్స, తొలి గుండె-ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేసిన వైద్యుడిగా ఆయన పేరొందారు. పద్మశ్రీ, హార్వర్డ్ మెడికల్ ఎక్స్లెన్స్ వంటి అవార్డులు అందుకున్నారు.
News January 26, 2025
ఘనంగా గణతంత్ర వేడుకలు
దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని BJP కేంద్ర కార్యాలయంలో జాతీయాధ్యక్షుడు JP నడ్డా, బెంగళూరులోని INC పార్టీ కార్యాలయం వద్ద AICC అధ్యక్షుడు ఖర్గే త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించారు. ముంబైలో MH గవర్నర్ రాధాకృష్ణన్, చెన్నైలో TN గవర్నర్ రవి, భువనేశ్వర్లో ఒడిశా గవర్నర్ హరిబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వేడుకలు జరిగాయి.