News October 22, 2024
ఆటో, ప్రైవేట్ బస్సు ఢీ.. నలుగురు మృతి

AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలకడ మండలం గుట్టపల్లి వద్ద కడప-చిత్తూరు హైవేపై ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.
Similar News
News September 19, 2025
సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం
News September 19, 2025
అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక విజయం

ఆసియా కప్: అఫ్గానిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.
News September 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.