News March 1, 2025
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్‌లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.
Similar News
News March 1, 2025
కొత్త ఏడాదిలో 2 నెలలు కంప్లీట్.. మరి?

2025లో అడుగుపెట్టి 2 నెలలు గడిచిపోయాయి. ఇన్ని రోజులూ అనుకున్నది చేయలేకపోయినా JAN 1 నుంచి మొదలుపెట్టాలని గతేడాది చివర్లో ప్లాన్ వేసుకొని ఉంటాం. బుక్స్ చదవాలనో, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనో, జిమ్‌కు వెళ్లాలనో, ఇతరత్రా రిజల్యూషన్స్ తీసుకుంటాం. వాటిని స్టార్ చేసి వదిలేసిన వారు, కొనసాగిస్తున్న వారు, అసలు మొదలెట్టని వారూ ఉంటారు. మరి మీ రిజల్యూషన్స్ ఎక్కడి వరకు వచ్చాయో COMMENT చేయండి.
News March 1, 2025
కౌలు రైతులకూ రూ.20 వేల సాయం

AP: ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఈ ఏడాది నుంచి ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రూ.20 వేలను భూమిలేని కౌలు రైతులకూ ప్రభుత్వం అందించనుంది. సాధారణంగా సాగు భూమి ఉన్న రైతులకు ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్రం ఏడాదికి రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు ఇస్తుంది. దీన్ని కౌలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, విధివిధానాలు త్వరలో రూపొందించనున్నారు.
News March 1, 2025
రేపటి నుంచి దబిడి దిబిడే..

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.