News January 12, 2025

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 12, 2025

గంటల కొద్దీ చూడటం నా భార్యకెంతో ఇష్టం: ‘కొవిషీల్డ్’ సీరమ్ అధిపతి

image

తన భార్యకూ తనను చూస్తూ ఉండిపోవడమంటే చాలా ఇష్టమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలా అన్నారు. వారానికి 90 గంటల పని అంశంపై స్పందించారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ వర్క్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. ‘అవును మహీంద్రా. నా భార్య నటాషా కూడా నేనెంతో అద్భుతంగా ఉన్నానని అనుకుంటుంది. ఆదివారాలు నన్నలా చూస్తూ ఉండిపోవడం ఆమెకెంతో ఇష్టం. #worklifebalance’ అని ట్వీట్ చేశారు.

News January 12, 2025

భవన నిర్మాణాల అనుమతుల అధికారం మున్సిపాలిటీలకు బదిలీ

image

AP: భవన నిర్మాణాలు, లేఔట్‌లకు అనుమతులిచ్చే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు ఇస్తుండగా, ఆ అధికారాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసింది. ప్రజల సౌలభ్యం కోసం నిబంధనలను సవరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే నగర పంచాయతీల్లో 3 ఎకరాలపైన లేఔట్ ఉంటే డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

News January 12, 2025

32 అంతస్తుల ఎత్తైన రాకెట్.. ప్రయోగానికి సిద్ధం

image

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ప్రారంభమైన 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 320 అడుగుల ఎత్తైన ఆ రాకెట్‌ను న్యూ గ్లెన్‌గా పిలుస్తున్నారు. అది సుమారు 32 అంతస్తుల భవనంతో సమానమని సంస్థ వర్గాలు వివరించాయి. అమెరికాలోని కేప్ కనవెరల్ రోదసి కేంద్రం నుంచి సోమవారం తెల్లవారుజాము ఒంటిగంటకు ఇది నింగిలోకి దూసుకుపోనుందని పేర్కొన్నాయి.