News October 4, 2024
ఇండియాలో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్

ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్‌కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.
Similar News
News March 27, 2026
వేసవికాలం.. కర్నూలు ఎస్పీ కీలక సూచనలు!

వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈత రాని పిల్లలు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో నీటి వనరుల వద్ద జారిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
News March 27, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 27)

1845: ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం
1985: సినీ నటుడు రామ్ చరణ్ జననం
1937: నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం
1968: అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ మరణం
☛ ప్రపంచ రంగస్థల దినోత్సవం
News March 27, 2026
ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులు వాయిదా

ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజులు ఆపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ఫేక్ న్యూస్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఇరానీయన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ కొనియాడారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ తాజా నిర్ణయం రిలీఫ్‌నిచ్చింది.


