News March 17, 2024
కాంగ్రెస్‌లోకి మరో నలుగురు BRS MLAలు?

TG: కాంగ్రెస్‌లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశానన్న CM రేవంత్ వ్యాఖ్యలతో BRS శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇవాళ చేవెళ్ల MP రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజుల్లో మరో నలుగురు BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. ఇటీవల CMను MLAలు ప్రకాశ్ గౌడ్, యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్, తెల్లం వెంకట్రావు తదితరులు కలిసిన విషయం తెలిసిందే.
Similar News
News March 8, 2026
వారంలో సుప్రీంలీడర్ ఎంపిక: ఇరాన్ ప్రతినిధి

వారంలో సుప్రీంలీడర్ ఎంపిక జరుగుతుందని ఇండియాలో ఇరాన్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ తెలిపారు. ‘సుప్రీంలీడర్‌ను 88 మంది నిపుణుల బృందం నామినేట్ చేస్తుంది. US, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఆ బృందం భేటీ జరగలేదు. అందుకే ఆలస్యం. ఒకవేళ కొత్త లీడర్‌ను US చంపితే, ఇంకొకరిని ఎంచుకుంటాం. మీరు 9 కోట్ల మందినీ చంపలేరు. అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. రెండేళ్లు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
News March 8, 2026
నేపాల్‌కు కాబోయే ప్రధాని.. చదివింది కర్ణాటకలోనే

నేపాల్‌లో Gen Z ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన RSP నేత బాలెన్ షా ఆ దేశ PM పీఠానికి చేరువయ్యారు. ఆయన ఉన్నత విద్య చదివింది ఇండియాలోనే కావడం విశేషం. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నికల్ వర్సిటీలో 2016-18 వరకు స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. కాగా తాజా ఎన్నికల్లో 165 స్థానాలకు గాను RSP 104 చోట్ల గెలిచింది. 21 చోట్ల లీడింగ్‌లో ఉంది. బ్యాలెట్ పేపర్ కావడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
News March 8, 2026
వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్‌లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్‌లో ‘AK47’ ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


