News December 22, 2024
స్కిల్స్ వర్సిటీలో మరో నాలుగు కోర్సులు

TG: యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మరో 4 కోర్సులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సప్లై చైన్ ఎసెన్షియల్ సర్టిఫికేషన్, ఎగ్జిక్యూటివ్, బ్యాంకింగ్- ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఫార్మా టెక్నీషియన్, లెన్స్కార్ట్ స్టోర్ అసోసియేట్ కోర్సులు ఉంటాయి. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగులు <
Similar News
News December 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 108 సమాధానం

ఈరోజు ప్రశ్న: హనుమంతుడికి ‘బజరంగబలి’ అనే పేరు ఎలా వచ్చింది?
సమాధానం: ‘బజరంగ్’ అంటే వజ్రంలా దృఢమైన శరీరం గలవాడని, ‘బలి’ అంటే బలశాలి అని అర్థం. ఇంద్రుడి వజ్రాయుధం వల్ల హనుమంతుని దవడ విరిగి, ఆయన శరీరం వజ్రంలా కఠినంగా మారింది. అందుకే భక్తులు ఆయన్ని బజరంగబలి అని పిలుస్తారు. ఆయన శారీరక శక్తితో పాటు అచంచలమైన బుద్ధిబలానికి, రామభక్తికి ఈ పేరు నిదర్శనంగా నిలుస్తుంది. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 26, 2025
గ్రేట్ CEO.. ఉద్యోగులకు రూ.2,155 కోట్ల బోనస్

540 మంది ఉద్యోగులకు రూ.2,155 కోట్లు బోనస్ ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు USలోని లూసియానాకు చెందిన ఫైబర్బాండ్ కంపెనీ CEO గ్రాహమ్ వాకర్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లకు ఎన్క్లోజర్లు తయారు చేసే తన కంపెనీని ఏడాది ప్రారంభంలో ఈటన్ కార్పొరేషన్కు రూ.15,265 కోట్లకు అమ్మేశారు. కష్టకాలంలో అండగా ఉన్న ఉద్యోగులకు 15% బోనస్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికి కొత్త యాజమాన్యం అంగీకరించిన తర్వాతే కంపెనీ అమ్మారు.
News December 26, 2025
కృష్ణా తీరంలో వేదాంత ఆన్షోర్ బావులకు అనుమతి

AP: కృష్ణా జిల్లాలో ఆయిల్ & గ్యాస్ నిక్షేపాల వెలికితీత కోసం 20 ఆన్షోర్ బావుల తవ్వకానికి ప్రభుత్వం వేదాంత కంపెనీకి NOC జారీచేసింది. తవ్వకాలు జరిపే బ్లాకులో కెనాల్ ఉండడంతో ఇరిగేషన్ దృష్ట్యా అనుమతి టెంపరరీ అని పేర్కొంది. బందర్, KDS కెనాల్స్, డ్రైనేజీ నెట్వర్క్, రిజర్వాయర్లు, చెరువుల నుంచి నీళ్లు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కాగా ఈ బ్లాకులో 35 ప్రాంతాల్లో తవ్వకాలకు వేదాంత NOC అడిగింది.


