News November 17, 2024
లగచర్ల ఘటనలో రిమాండ్‌కు మరో నలుగురు.. కలెక్టర్‌కు భద్రత పెంపు
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటివరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా, కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భద్రతను పెంచింది. 1+1 భద్రతను 2+2కి మార్చింది. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
Similar News
News November 17, 2024
పుతిన్‌కు మస్క్ ఫోన్ కాల్.. విచారణకు డెమొక్రాట్ల డిమాండ్
ట్రంప్ ప్రభుత్వంలో <<14596564>>కీలక పదవి<<>> దక్కించుకున్న ఎలాన్ మస్క్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అక్టోబర్‌లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఆ దేశ అధికారులతో అనధికారికంగా పలు ఒప్పందాలపై ఫోన్లో మాట్లాడినట్లు ఇద్దరు డెమొక్రటిక్ సెనేటర్లు ఆరోపించారు. ఈ క్రమంలో మస్క్‌పై జాతీయ భద్రతా కారణాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాశారు. ఇలాంటి వ్యక్తికి GOVT ఎఫీషియెన్సీ బాధ్యతలు అప్పగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
News November 17, 2024
‘మట్కా’ సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. రూ.42కోట్లతో ఈ మూవీని రూపొందించగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15కోట్లు చెల్లించినట్లు సమాచారం. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ఈనెల 14 రిలీజైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News November 17, 2024
నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబు దాడి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి కలకలం రేపింది. రెండు బాంబులు ఆయన ఇంటి గార్డెన్లో పడ్డట్లు రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని వెల్లడించారు. దాడి వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ అటాక్ పని ఇరాన్‌దేనని భావిస్తున్నారు.