News March 25, 2025

తెలంగాణ క్యాబినెట్‌లోకి నలుగురు కొత్త మంత్రులు!

image

క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, ఉత్తమ్, మహేశ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈక్రమంలో నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీల మేరకు మక్తల్ MLA శ్రీహరి ముదిరాజ్‌, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి.వివేక్, బోధన్ MLA సుదర్శన్ రెడ్డికి ‘అమాత్య’ యోగం కల్పించనున్నట్లు సమాచారం.

Similar News

News November 26, 2025

వనపర్తి: నామినేషన్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియను గురువారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే టీ.పోల్‌లో అప్‌లోడ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.