News February 24, 2025
విద్యుత్ షాక్తో నలుగురు మృతి

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం
Similar News
News February 24, 2025
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ప్లేయర్

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీస్ పెర్రీ చరిత్ర సృష్టించారు. టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె అవతరించారు. ఇప్పటివరకు పెర్రీ 835 పరుగులు సాధించారు. ఈ క్రమంలో మెగ్ లానింగ్(782) రికార్డును ఆమె తుడిచిపెట్టేశారు. యూపీతో జరుగుతున్న మ్యాచులో ఆమె ఈ ఫీట్ నెలకొల్పారు. కాగా ఐపీఎల్లోనూ అత్యధిక పరుగుల రికార్డు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (8,004) పేరిట ఉన్న విషయం తెలిసిందే.
News February 24, 2025
అలాంటప్పుడు ఎన్ని పదవులు వచ్చినా వేస్ట్: పవన్ కళ్యాణ్

AP: ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో, ఏ పరమాత్మ అయితే స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా నిష్ప్రయోజనం అని Dy.CM పవన్ అన్నారు. ‘నేను మూర్ఖంగా వాదించే హిందువును కాదు. కానీ లౌకిక వాదం పేరుతో హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నమ్మకాలపై పదే పదే దాడులు చేస్తుంటే నాకు ఇబ్బంది అనిపించింది. దీని వల్ల ఓట్లు వస్తాయా పోతాయా అనే లెక్కలు వేసుకోను’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
News February 24, 2025
పురుష వైద్యులు మహిళా సిబ్బందికి రక్షణగా ఉండాలి: ప.బెంగాల్ సీఎం

వైద్య రంగంలో పనిచేస్తున్న పురుషులు తమతో పని చేసే మహిళా ఉద్యోగులకు రక్షణగా ఉండాలని ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆర్జీకర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రూ.10,000-రూ.15,000 వరకు జీతాల పెంపును ప్రకటించారు.