News January 31, 2025

3 టమాటాలతో నలుగురు 30 గంటలు బతికారు

image

ఇటీవల ఢిల్లీ బురారీలో నాలుగంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో నలుగురు కుటుంబసభ్యులను రెస్క్యూ బృందాలు కాపాడాయి. శిథిలాల కింద చిక్కుకున్న రాజేశ్(30), గంగోత్రి(26), వారి కుమారులు ప్రిన్స్(6), రితిక్(3) కేవలం 3 టమాటాలతో 30 గంటలు జీవించారు. ఈ నెల 27న పైకప్పు స్లాబ్ గ్యాస్ సిలిండర్‌పై పడటంతో ఏర్పడిన ఖాళీ స్థలంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాగా ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

Similar News

News November 9, 2025

నైట్ పార్టీల్లో ఇలా మెరిసిపోండి

image

పార్టీల్లో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. అయితే నైట్ పార్టీల్లో న్యూడ్ కలర్స్ కంటే ముదురురంగు లిప్‌స్టిక్ బావుంటుంది. ప్లెయిన్ ఐ షాడోకి గ్లిట్టర్ యాడ్ చెయ్యాలి. కాంపాక్ట్ పౌడర్ లైట్‌గా అద్దుకోవాలి. బ్రాంజర్‌తో కాంటూర్, చెక్కిళ్లకు బ్లషర్ అద్దాలి. ఫాల్స్ ఐ లాషెస్ లేదా డ్రమాటిక్ మస్కారా యాడ్ చెయ్యాలి. హైలైటర్‌ను చెక్కిళ్లు, బ్రో బోన్ మీద అద్దుకుంటే పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు.

News November 9, 2025

CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

image

AP: రాష్ట్రాన్ని మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో MSME ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘IT రంగంలోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. MSME విభాగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఏపీపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది’ అని పేర్కొన్నారు.

News November 9, 2025

రెండో అనధికారిక టెస్ట్.. ఇండియా-A ఓటమి

image

సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా-A ఓడింది. భారత్ నిర్దేశించిన 417 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బవుమా సహా మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అటు భారత జట్టులో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదారు. అంతకుముందు తొలి అనధికారిక టెస్టులో IND గెలిచింది. కాగా ఈనెల 14 నుంచి IND, SA మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.