News April 7, 2025
మీకోసం నాలుగు సూత్రాలు!

హెల్తీ లైఫ్ కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో డైట్, సరైన దినచర్య కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ‘రోజులో 12 గంటల వ్యవధిలో ఏమీ తినకుండా ఉండాలి. వారానికి 2 సార్లు 5 ని.ల చొప్పున స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. నిద్ర మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 20ని.లు ఎండలో నిలబడాలి. రోజులో 15 ని.లు మీకోసం కేటాయించుకొని ఫోన్ పక్కన పెట్టి ఇష్టమైన పనులు చేయాలి’ అని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News November 13, 2025
రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్‌పై మరికొన్ని అప్డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.
News November 13, 2025
వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.
News November 13, 2025
షమీని ఎందుకు తీసుకోవట్లేదు? గిల్ సమాధానమిదే

షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్‌గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్‌రౌండర్ లేదా ఎక్స్ట్రా స్పిన్నర్‌ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.


