News July 9, 2024
అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్ట్

USలోని టెక్సాస్లో మానవ అక్రమరవాణా కేసులో నలుగురు తెలుగువారు అరెస్ట్ అయ్యారు. కొలిన్ కౌంటీలోని ప్రధాన నిందితుడు సంతోష్ కట్కూరి నివాసంలో 15 మంది మహిళలను ప్రిన్స్టన్ పోలీసులు గుర్తించారు. సంతోష్, సతీమణి ద్వారకా వీరిని తమ షెల్ కంపెనీలకు పనిచేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో చందన్, అనిల్ అనే మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ర్యాకెట్లో 100 మందికిపైగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Similar News
News January 21, 2026
FLASH: పెరిగిన వెండి ధర

ఇవాళ ఉదయం నుంచి తటస్థంగా ఉన్న వెండి ధర మధ్యాహ్నం పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.3,45,000కు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,474గా ఉంది.
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.
News January 21, 2026
APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<


