News September 1, 2025
మెడికల్ స్టూడెంట్స్‌కు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

తెలంగాణలో మెడిసిన్ చదివే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వరుసగా 9 ,10, 11, 12 తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్‌కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న ప్రభుత్వ జీవో నంబర్ 33ని సమర్థించింది. గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించింది.
Similar News
News September 23, 2025
ఆర్టీసీ ఉద్యోగులకు దసరా అడ్వాన్స్: సజ్జనార్

TG: ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News September 23, 2025
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News September 23, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.