News December 5, 2024

RGSA అమలులో ఏపీకి నాలుగో స్థానం: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(RGSA) పథకం అమలులో FY24లో 25వ స్థానంలో ఉన్న AP ప్రస్తుతం నాలుగో ప్లేస్‌కు చేరినట్లు Dy.CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రధాని మోదీ దూరదృష్టి, సీఎం చంద్రబాబు నాయకత్వానికి ఇది నిదర్శనమని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ డెవలప్‌మెంట్, గిరిజన సంక్షేమానికి RGSA కృషి చేస్తోందని పేర్కొన్నారు. కలిసికట్టుగా గ్రామీణ భారత రూపురేఖలను మారుస్తున్నామన్నారు.

Similar News

News February 12, 2026

VIRAL: ₹300తో కొని ₹634కోట్లకు అమ్మాడు!

image

మలేషియాకు చెందిన కింగ్ అర్స్యాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం ₹300తో ‘ai.com’ అనే డొమైన్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏఐకి పెరిగిన క్రేజ్ వల్ల ఈ డొమైన్‌ను ఇస్మాయిల్ ఒక క్రిప్టో సంస్థకు ఏకంగా ₹634 కోట్లకు విక్రయించారు. కామ్‌ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఈ డొమైన్‌ను దక్కించుకున్నారు. గతంలో దీనిని ‘OpenAI’ కూడా వాడుకుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభం పొందిన అరుదైన డీల్‌గా ఇది నిలవడం విశేషం.

News February 12, 2026

పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ

image

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పేషీలో కలిశారు. నియోజకవర్గ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

News February 12, 2026

రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.