News January 12, 2025
ఈ నెలలో ₹22,194 కోట్ల FPIల ఉపసంహరణ

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(FPI) విక్రయాల పర్వం కొనసాగుతోంది. 2024 DECలో ₹15,446Cr వాటాలను కొనుగోలు చేయగా, ఈ నెల 10 నాటికి ఏకంగా ₹22,194Cr కోట్లను ఉపసంహరించుకున్నారు. US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అధిక ద్రవ్యోల్బణం, GDP వృద్ధి తగ్గుదల కూడా నిధుల తరలింపునకు ఓ కారణం.
Similar News
News December 9, 2025
ఈ టైమ్‌లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్‌లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్‌ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it
News December 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 91 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీరాముడి కవల కుమారులే లవకుశులు. మరి రాముడు తన పుత్రులతో యుద్ధమెందుకు చేశాడు?
సమాధానం: శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధ యాగ గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమంలో ఉన్న లవకుశులు బంధించారు. అది వారి తండ్రి అశ్వమని వాళ్లకు తెలియదు. అయితే, రాజధర్మాన్ని పాటించాల్సి వచ్చిన రాముడు, గుర్రాన్ని విడిపించడానికి తన సైన్యాన్ని పంపగా, ఆ ఘట్టం చివరకు తండ్రీకొడుకుల మధ్య యుద్ధానికి దారితీసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 9, 2025
భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.


