News October 9, 2024
ఒసామా బిన్ లాడెన్ కొడుకుపై ఫ్రాన్స్‌లో నిషేధం

ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్‌ను ఫ్రాన్స్ బహిష్కరించింది. ఓ బ్రిటిష్ పౌరురాల్ని పెళ్లాడి నార్మండీలో సెటిలై చాలాకాలంగా పెయింటింగ్స్ వేస్తూ కాలం గడిపిన ఒమర్, గత ఏడాది సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతునిస్తూ కామెంట్స్ పెట్టారు. దీంతో అతడిని దేశం నుంచి బయటికి పంపించిన ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి రాకుండా నిషేధం విధించింది. ఒమర్ ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నట్లు సమాచారం.
Similar News
News October 18, 2025
కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు

TG: జిల్లా–కోఆపరేటివ్ బ్యాంకుల్లో(DCCB) స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. వయసు 18-30 ఏళ్లు. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్ వివరాలకు <
News October 18, 2025
కల్తీ మద్యం కేసు: ప్రధాన నిందితుడితో జోగి రమేశ్ ఫొటోలు!

AP: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేశ్ కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఓ వేడుకలో వీరు పక్కపక్కనే కూర్చున్నారు. కాగా జనార్దన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రమేశ్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారు చేశామని జనార్దన్ వెల్లడించడం గమనార్హం.
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.