News June 24, 2024

‘Groww’ ట్రేడింగ్ యాప్‌పై ఫ్రాడ్ ఆరోపణలు!

image

ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ యాప్ ‘గ్రో’ మోసాలకు పాల్పడుతోందని ఓ యూజర్ సంచలన ఆరోపణలు చేశారు. తన డబ్బును గ్రో యాప్ మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేయలేదని, ఓ నకిలీ పోర్ట్‌ఫోలియో నంబర్ ఇచ్చిందన్నారు. పొరపాటుగా ఇలా జరిగిందని, కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కాలేదని సంస్థ తెలిపింది. కానీ సంస్థపై నమ్మకం కోల్పోకుండా ఆ మొత్తాన్ని క్రెడిట్ చేస్తున్నామన్న గ్రో, కస్టమర్ తన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది.

Similar News

News October 30, 2025

యూట్యూబ్‌ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

image

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

News October 30, 2025

దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

image

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.

News October 30, 2025

అక్టోబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి మరణం
1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం (ఫొటోలో)
1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశంగా చేరింది
1987: సినీ దర్శకుడు రాజాచంద్ర మరణం
1990: దర్శకుడు, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
✒ ప్రపంచ పొదుపు దినోత్సవం