News April 2, 2025
FREE బస్సు.. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో ఇదీ పరిస్థితి..!

ఫ్రీ బస్సు కారణంగా తాము బస్సు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పురుషులు మంగళవారం వాపోయారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వచ్చిన బస్సులన్నింటిలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం సెలవు, బుధవారం వర్కింగ్ డే కావడంతో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.
Similar News
News April 3, 2025
MBNR: 29 వేల మందికి మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం

మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ కింద 31,190 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు రాయితీతో అవకాశం కల్పించినా కేవలం 2వేల మంది మాత్రమే పరిష్కరించుకున్నారు. మిగిలిన 29 వేల మంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ నెల వరకు 25 శాతం సబ్సిడీతో పరిష్కరించుకునేలా అవకాశాన్ని పొడిగించింది. ఇకనైనా వీరు ముందుకొస్తారో లేదో వేచి చూడాల్సిందే.
News April 3, 2025
మహబూబ్‌నగర్: GREAT.. ప్రజల కోసం రూ.లక్ష

మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలమూరు వాసులు మద్ది అనంతరెడ్డి, మద్ది యాదిరెడ్డి కలిసి జిల్లా ఎస్పీ జానకికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం చెక్కును ఎస్పీకి అందించారు. పట్టణంలో భద్రతను పెంపొందించేందుకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.
News April 3, 2025
మహబూబ్‌నగర్ బిడ్డలు తగ్గేదేలే: MLA

విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలో బుధవారం ఆయన నీట్, ఎంసెట్ కోర్సులో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో నీట్, ఎంసెట్ కోర్స్‌ను అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ బిడ్డలు ఎందులోనూ తక్కువ కాదని, ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారని ఆయన అన్నారు.