News July 5, 2025

రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

image

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.

Similar News

News July 5, 2025

కోహెడ: ‘గురుకుల మైదానంలో మొక్కలు నాటాలి’

image

గురుకుల మైదానంలో మొక్కలు నాటాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. కోహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు. రిజిస్టర్ వెరిఫై చేసిన అనంతరం పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

News July 5, 2025

కాసేపట్లో వర్షం: వాతావరణ కేంద్రం

image

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

News July 5, 2025

ప్రసిద్ధ్ కృష్ణపై ట్రోల్స్

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై SMలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. షార్ట్ పిచ్ బంతులు వేసి జేమీ స్మిత్ సెంచరీకి కారణమయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ‘ప్రసిద్ధ్ భారత్ వెర్షన్ హారిస్ రవూఫ్’ అని ఒకరు, ‘అతడిని వెంటనే ఇండియాకు పంపండి.. అవసరమైతే టికెట్ నేనే స్పాన్సర్ చేస్తా’ అని మరొకరు, ‘ప్రసిద్ధ్ ఇంగ్లండ్ తరఫున రన్ మెషిన్’ అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.