News October 5, 2025
పిల్లల ఆధార్‌లో ఫ్రీగా బయోమెట్రిక్ అప్‌డేషన్: UIDAI

పిల్లల ఆధార్‌లో మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు అయ్యే ఛార్జీలను ఏడాది పాటు రద్దు చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది. 5-7, 15-17 ఏళ్ల వయసున్న పిల్లలు ఉచితంగా బయోమెట్రిక్, ఐరిస్, ఫొటో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. UIDAI రూల్ ప్రకారం పిల్లలకు ఐదేళ్ల వయసులో ఒకసారి, ఆ తర్వాత 15 ఏళ్లు వచ్చాక మరోసారి బయోమెట్రిక్స్, ఫొటో అప్‌డేషన్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.
Similar News
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు


