News December 30, 2024
ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?

AP: సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<
News December 1, 2025
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.


