News July 11, 2024
ఏపీలో ఆరోజు నుంచి మహిళలకు ఫ్రీ బస్?

రాష్ట్రంలో కీలక హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కాగా అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను సైతం ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16న మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Similar News
News November 24, 2025
ధర్మేంద్ర బాలీవుడ్ ‘He-Man’ ఎలా అయ్యారంటే?

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్ అని నిక్ నేమ్ ఉంది. ధర్మేంద్రకు ఉన్న మస్క్యులర్ బాడీ, రగ్గ్డ్ లుక్స్, 1960-70ల మధ్య ఎక్కువగా యాక్షన్ పాత్రలు చేయడంతో ఆయనకు ఈ పేరు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి జానర్స్ కలుపుకుని దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర చివరిగా నటించిన ‘ఇక్కీస్’ అనే చిత్రం త్వరలో విడుదలకానుంది.
News November 24, 2025
ఆఖరి మజిలీలో అడవి పార్టీ!

అట్టడుగు వారికి చట్టం చేయని న్యాయం తుపాకీ గొట్టం చేస్తుందని నమ్మిన అడవి పార్టీ ఆఖరి మజిలీలో ఉంది. అర్ధ శతాబ్దం క్రితం సమాజంలో వారి అవసరం, ఆ స్థాయిలో మద్దతూ ఉండేవి. కాలంతో పాటు పరిస్థితులు, ప్రజల జీవనం మారాయి. కానీ నక్సలైట్లుగా మొదలై మావోయిస్టులుగా రూపాంతరం చెందినా తమ పోరాట పంథా మార్చుకోలేదు. ఫలితం.. ప్రజలకు పరిష్కారం అవుతామన్న ‘అన్న’ తమ ఊపిరి ఉండాలంటే ‘గన్ను’ వీడటమే పరిష్కారమనేలా చేసింది.
News November 24, 2025
బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.


