News September 23, 2024

మహిళలకు ఫ్రీ బస్సు.. మంత్రి కీలక ప్రకటన

image

AP: మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. దీపావళి నుంచి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు వారికి రూ.5-10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. అటు అన్న క్యాంటీన్ల ద్వారా ఆకలి కేకలు లేకుండా పేదలకు మూడు పూటలా ఆహారం అందుతుందన్నారు.

Similar News

News September 23, 2024

కోదండరాంకు రేపు TJAC సన్మానం

image

TJAC ఆధ్వర్యంలో ఈ నెల 24న MLC కోదండరాంను సన్మానించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన అప్పటి తమ ఛైర్మన్ కోదండరాం కృషి మరువలేనిదని JAC నేతలు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత ఆయనకు MLC ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, గెజిటెడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్-1 ఇలా 205 సంఘాలతో JAC ఏర్పాటైందని గుర్తు చేశారు.

News September 23, 2024

బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

TG: మహబూబ్‌నగర్(D) దేవరకద్ర(మ)లో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న బయటకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి అనంతరం వదిలిపెట్టాడు. ఇంటికొచ్చిన బాలిక కూలి పనులకు వెళ్లొచ్చిన తల్లికి విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.

News September 23, 2024

ప్రభుత్వం పిరికిపంద చర్యలు ఆపాలి: BRS

image

TG: డాక్టర్లతో తాము ఏర్పాటు చేసిన బృందం ఆసుపత్రులను సందర్శిస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని BRS ప్రశ్నించింది. వైద్యారోగ్య సేవల తీరుపై అధ్యయనం చేసే డాక్టర్ల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. డా.తాటికొండ రాజయ్య, డా.కల్వకుంట్ల సంజయ్, డా.మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంది. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హితవు పలికింది.