News August 15, 2025
ఇవాళ్టి నుంచే మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం

AP: రాష్ట్రంలో నేటి నుంచి మహిళలకు RTCబస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది. సా.4గం.కు గుంటూరు(D) తాడేపల్లి మం. ఉండవల్లి గుహల వద్ద CM చంద్రబాబు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మహిళలతో కలిసి సీఎం, Dy.CM పవన్ బస్సులో ప్రయాణిస్తారు. 5రకాల RTC బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఫ్రీగా ప్రయాణించొచ్చు. బస్సు ఎక్కగానే గుర్తింపుకార్డు చూపించి ‘జీరో ఫేర్ టికెట్’ తీసుకోవాలి.
Similar News
News August 15, 2025
నేడే ట్రంప్, పుతిన్ భేటీ.. ఏం జరగనుంది?

US, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్‌ల కీలక భేటీకి రంగం సిద్ధమైంది. పుతిన్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పనిచేయని ప్రాంతమైన అలాస్కా(US)లో ఇవాళ వారు భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, US ఆంక్షలు, ట్రేడ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. చర్చలు విఫలమైతే INDపై టారిఫ్స్ మరింత పెరగొచ్చని US <<17407178>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే. దీంతో ఏం జరగనుందన్న ఉత్కంఠ భారతీయుల్లోనూ నెలకొంది.
News August 15, 2025
నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు.. సీఎం అభినందనలు

AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి(D) నారావారిపల్లెకు పీఎం సూర్యఘర్ పథకం కింద స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో తక్కువ టైంలో సోలార్ రూఫ్‌టాప్ పనులను పూర్తి చేశారు. దీంతో ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద కేంద్రం గుర్తించింది. SEP 20న ఢిల్లీలో జిల్లా అధికారులు అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులను CM చంద్రబాబు అభినందించారు.
News August 15, 2025
అమల్లోకి రూ.3000 యాన్యువల్ పాస్

దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి రూ.3,000 ఫాస్టాగ్ పాస్ అమల్లోకి వచ్చింది. నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పాస్ తీసుకుంటే ఫాస్టాగ్‌ను పదేపదే రీఛార్జ్ చేయించాల్సిన అవసరం లేదు. ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు ఈ పాస్‌తో ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి <<17380892>>క్లిక్ <<>>చేయండి.