News February 28, 2025

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు: షర్మిల

image

AP: కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అంతా అంకెల గారడీ, అభూత కల్పన అని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ఇది పస లేని బడ్జెట్. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే రూ.6300 కోట్లే కేటాయించారు. తల్లికి వందనం నిధుల్లో కోత పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి ఊసే లేదు’ అని మండిపడ్డారు.

Similar News

News January 11, 2026

సొరకాయ జ్యూస్ తాగుతున్నారా?

image

సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు జాగ్రత్త అవసరమని ICMR హెచ్చరించింది. ఇటీవల చేదుగా ఉన్న జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, UPలో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిపుణులు పరిశీలించి టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్ అనే విష పదార్థాల వల్లే సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ విషానికి ప్రత్యేకంగా విరుగుడు లేదని తెలిపారు. దీంతో ఎక్కువ చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ తాగకూడదని అధికారులు సూచించారు.

News January 11, 2026

పురుగు మందుల పిచికారీ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

పురుగు మందులను పంటపై పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా ముక్కు, కండ్లకు మందు తాకకుండా హెల్మెట్‌ లాంటిది తప్పనిసరిగా ధరించాలి. మందును కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో నీళ్లు తాగడం, బీడీ, సిగరెట్‌ కాల్చకూడదు. పురుగు మందుల పిచికారీ తర్వాత స్నానం చేశాకే తినాలి. మందును గాలి వీచే వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు. సాధ్యమైనంత వరకు గాలి, ఎండ ఉన్న సమయంలోనే స్ప్రే చేయడం మంచిది.

News January 11, 2026

కలుపు తీయని పైరు కర్ర చేయదు

image

పొలంలో కలుపును రైతులు సరైన సమయంలో గుర్తించి తొలగించకపోతే పంటకు అందాల్సిన పోషకాలను ఆ కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీని వల్ల పైరులో ఎదుగుదల లోపిస్తుంది. ఫలితంగా సరిగా గింజ పట్టదు లేదా బలమైన ‘కర్ర’ (కాండం)గా ఎదగదు. అలాగే ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి గొప్పగా ఎదగాలన్నా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న అనవసరమైన విషయాలను, లోపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని ముందుకు సాగాలని ఈ సామెత తెలియజేస్తుంది.