News December 6, 2024

సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం?

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. నెల రోజుల్లో కొత్తగా వెయ్యి బస్సులు, మరిన్ని అద్దె బస్సులు సమకూర్చుకుని ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News March 20, 2026

ధురంధర్-2: తొలి రోజే ₹100 కోట్లు!

image

భారీ అంచనాల మధ్య రిలీజైన ధురంధర్-2 సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజే ₹102 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిందని Sacnilk తెలిపింది. ప్రీమియర్స్‌తో కలుపుకొని ₹145 కోట్లు(₹172 Cr గ్రాస్) రాబట్టిందని వెల్లడించింది. 12,735 ప్రీమియర్ షోలు, తొలి రోజు 21,728 షోలు పడినట్లు చెప్పింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.

News March 20, 2026

ఆ 22 నౌకలొస్తేనే..

image

పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే శివాలిక్, నందాదేవి నౌకలు LPGతో భారత్ చేరుకోవడంతో స్వల్ప ఉపశమనం లభించింది. కానీ మరో 22 షిప్‌లు <<19422225>>హార్ముజ్<<>> వద్దే నిలిచిపోయాయి. ఈ నౌకలే భారత ఇంధన భద్రతకు కీలకం. వీటిని హార్ముజ్ దాటించడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నౌకల రాక ఆలస్యమైనా, చాలాకాలం అక్కడే చిక్కుకుపోయినా దేశంలో గ్యాస్ కొరత మరింత తీవ్రమయ్యే ఆస్కారముంది.

News March 20, 2026

భారత్‌లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్

image

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 నిర్వహణకు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కాయి. ఈవెంట్ నిర్వహించేందుకు భారత్‌, న్యూజిలాండ్ పోటీ పడ్డాయి. మౌలిక వసతుల పరిశీలన అనంతరం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈవెంట్ నిర్వహణకు అనుమతి వచ్చింది. దీంతో ఆసియాలో జపాన్, ఖతర్, చైనా తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఇక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 పోలాండ్ వేదికగా నేడు ప్రారంభం కానుంది.