News March 7, 2025

ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే: మంత్రి సంధ్యారాణి

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలిలో తెలిపారు. ఉచిత బస్సు పథకం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని YCP సభ్యుడు PV సూర్యనారాయణరాజు అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఏ జిల్లాల్లోని మహిళలకు, ఆ జిల్లాల్లోనే RTC ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామన్నారు. TG, కర్ణాటకలో RTC ఉచిత ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News December 1, 2025

సమంత-రాజ్ వివాహ ప్రక్రియ గురించి తెలుసా?

image

<<18437680>>సమంత-రాజ్<<>> ఈషా కేంద్రంలో ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచే పవిత్ర ప్రక్రియే ఇది. లింగ భైరవి లేదా ఎంపిక చేసిన ఆలయాల్లో ఈ తరహా క్రతువులు నిర్వహిస్తారు. దీంతో దంపతుల మధ్య సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెంపొందుతుందని విశ్వసిస్తారు. సద్గురు చేతుల మీదుగా ఈ లింగ భైరవి దేవి ప్రాణప్రతిష్ఠ జరిగింది.

News December 1, 2025

లేటు వయసులో ప్రేమే స్ట్రాంగ్

image

35 ఏళ్ల తర్వాత జీవితంలోకి వచ్చే ప్రేమ, పెళ్లిలో బ్రేకప్‌లు, విడాకులు ఉండవని మహిళలు నమ్ముతున్నారని ‘సైకాలజీ టుడే’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొంది. టీనేజ్ ప్రేమ, పెళ్లిళ్లలో ఆశలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి సరిగా లేకపోయినా మార్చుకోవచ్చని భావిస్తారు. కానీ 35 తర్వాత ఒక వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తులో మారే అవకాశ తక్కువ. అలాగే ఆ వయసులో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తెలిపారు.

News December 1, 2025

13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్‌లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://www.ibps.in/