News August 22, 2024

‘ఉచిత బస్సు ప్రయాణం’ ఆలస్యమైనా పొరపాట్లు ఉండొద్దు: సీఎం చంద్రబాబు

image

AP: తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News October 27, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసును సీఐడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబ ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.

News October 27, 2025

నాగార్జున సాగర్.. CCTVల ఏర్పాటుకు అనుమతి

image

నాగార్జున సాగర్ జలాశయం కుడి వైపు(AP) CCTVల ఏర్పాటుకు TG ప్రభుత్వానికి KRMB అనుమతి ఇచ్చింది. డ్యామ్ పర్యవేక్షణకు AP భూభాగంలో CCTVల ఏర్పాటుకు TG నీటిపారుదల అధికారులు ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పాటు సాగర్ కుడివైపు రిజర్వాయర్ నిర్వహణకూ ఏపీ అనుమతి ఇవ్వడం లేదనే ఫిర్యాదుపై KRMB స్పందించింది. 2014లో విభజన చట్టం తర్వాత, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ చూసుకుంటోంది.

News October 27, 2025

ఏడాదిలో ఒక్కసారైనా చేసుకోవాల్సిన టెస్టులు!

image

* CBC (కంప్లీట్ బ్లడ్‌కౌంట్): రక్తహీనత & ఇన్ఫెక్షన్లను తెలిపేది
* HbA1c: రక్తంలో దీర్ఘకాలిక చక్కెర స్థాయులను చూపేది
* లిపిడ్ ప్రొఫైల్: గుండె జబ్బుల ప్రమాదాన్ని వెల్లడించేది
* విటమిన్-D: అలసట & రోగ నిరోధకశక్తి తక్కువగా ఉందని తెలిపేది
* విటమిన్ B12: మానసిక ఆరోగ్యం & నరాల పనితీరు అంచనా కోసం
* సి-రియాక్టివ్ ప్రొటీన్ (CRP): శరీరంలో వాపును సూచించేది
* LFT& KFT టెస్ట్: లివర్, కిడ్నీ పనితీరు అంచనా వేసేది