News February 4, 2025
బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల28 వరకు ఫ్రీ క్యాంప్ కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి.
Similar News
News January 21, 2026
నవీన్ పొలిశెట్టి కండిషన్స్ నిజమేనా?

హీరో నవీన్ పొలిశెట్టికి సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. అదేంటంటే ఆయన కొత్తగా 2 కండిషన్స్ పెడుతున్నారంట. ‘ఒకటి రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. రెండోది మూవీ మొత్తం తానే చూసుకుంటారు’ అని అంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే నిర్మాత మూవీకి సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. బడ్జెట్ ఇస్తే ఆఖర్లో ఫస్ట్ కాపీ చూపిస్తారు. అయితే ఈ ప్రచారాల్లో నిజమెంత అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
News January 21, 2026
T20WC ఆడతామో.. లేదో: బంగ్లా కెప్టెన్

టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని చెప్పారు.
News January 21, 2026
రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్లు

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.


