News January 30, 2025
పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు విద్యార్థులకు ఫ్రీ కౌన్సెలింగ్

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తొలగించేందుకు CBSE కీలక నిర్ణయం తీసుకుంది. FEB 1 నుంచి APR 4 వరకు IVRS, పాడ్కాస్ట్, ఫోన్ కాల్స్ ద్వారా ఫ్రీగా సైకో-సోషల్ కౌన్సెలింగ్ ఇవ్వనుంది. ఎగ్జామ్స్కు ముందు, ఆ తర్వాత ఈ సర్వీస్ అందించనుంది. టోల్ఫ్రీ నంబర్ 1800118004 ద్వారా IVRS సౌకర్యం ఉంటుంది. CBSE వెబ్సైట్లో పాడ్కాస్ట్లు ఉంటాయి. నిపుణులు నేరుగా విద్యార్థులకే కాల్ చేసి కూడా కౌన్సెలింగ్ ఇస్తారు.
Similar News
News October 19, 2025
APPLY NOW: BELలో 176 ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)176 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 40 సమాధానాలు

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ‘24 వేల’ శ్లోకాలు ఉన్నాయి.
2. ‘యముడి’ అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు.
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ‘మాస శివరాత్రి’ అని అంటారు.
4. హనుమాన్ చాలీసాను రచించిన భక్తుడు ‘తులసీదాస్’.
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ‘కంచర్ల గోపన్న’.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 19, 2025
ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి: సీఎం

తెలంగాణ ప్రజలకు CM రేవంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.