News August 2, 2024
సర్కారు బడులకు ఫ్రీ కరెంట్: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం పాల్గొన్నారు. దీంతో పాటు ప్రభుత్వ టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేలా చూసే బాధ్యత తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు. మెరుగైన విద్య, వైద్యం అందించడం వల్లే ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడుసార్లు గెలిచారని గుర్తు చేశారు.
Similar News
News November 23, 2025
KMM: డీసీసీ అధ్యక్షుల్లో మంత్రుల అనుచరులకు కీలక స్థానం

ఖమ్మం డీసీసీ అధ్యక్షుల నియామకంలో ముగ్గురు మంత్రుల అనుచరులకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి వర్గానికి చెందిన నూతి సత్యనారాయణ, ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల వర్గం నుంచి నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా మంత్రి పొంగులేటి వర్గానికి చెందిన తోటదేవి ప్రసన్న ఖరారయ్యారు. ఈ నియామకాలతో సామాజిక న్యాయం కూడా జరిగిందనే చర్చ జరుగుతోంది.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


