News October 24, 2024

ఉచిత సిలిండర్.. బుకింగ్స్ ఎప్పుడంటే?

image

AP: ఈనెల 31 నుంచి ఉచిత సిలిండర్ పథకం ప్రారంభం కానుంది. దానికి 3,4 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈనెల 31 నుంచి 2025 MAR నెలాఖరులోపు ఒక సిలిండర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత 2025 APR 1 నుంచి JULY నెలాఖరు వరకు మొదటిది, AUG 1 నుంచి NOV లాస్ట్ వరకు రెండోది, DEC 1 నుంచి 2026 MAR నెలాఖరు నాటికి మూడో సిలిండర్ ఇస్తారు. డెలివరీ సమయంలో డబ్బులు చెల్లిస్తే 48గంటల్లో ఖాతాల్లో ప్రభుత్వం ఆ సొమ్మును జమ చేస్తుంది.

Similar News

News October 24, 2024

నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీ?

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.

News October 24, 2024

భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం

image

AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.

News October 24, 2024

జగన్ హయాంలోనే డ్రోన్ల వినియోగం: YCP

image

AP: కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో శాడిస్ట్ చంద్రబాబుది అందెవేసిన చేయి అంటూ వైసీపీ విమర్శించింది. వైఎస్ జగన్ హయాంలో డ్రోన్లని విరివిగా వాడినా ఇప్పుడు ఆ ఘనత తనదేనంటూ చంద్రబాబు గప్పాలు కొడుతున్నారని మండిపడింది. ఇదంతా జనం చూసి నవ్విపోతారనే సోయి లేకపోతే ఎలా అంటూ ట్వీట్ చేసింది. జగన్ హయాంలో ఎరువులు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లను వాడినట్లు పేర్కొంది.