News October 8, 2025

ఉచిత పశుగ్రాసం సాగు పథకం – అర్హత, ఎంపిక ఇలా

image

AP: పశువులు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఉచిత పశుగ్రాసం సాగు పథకం వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న SC,ST, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు. రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

Similar News

News March 22, 2026

PPPలది సక్సెస్ ఫార్ములా: చంద్రబాబు

image

AP: దేశంలో పీపీపీ విధానంలో చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు, ఎయిర్ పోర్టులు విజయవంతం అయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. క్వాంటం, ఏఐ, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని HYD ISBలో తెలిపారు. వివిధ దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోందని.. భారత్‌లో ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

News March 22, 2026

అస్సాం.. ఏ కూటమిలో ఏ పార్టీ?

image

అస్సాం ఎన్నికల్లో హాట్రిక్ కొట్టాలని BJP, అధికారమే లక్ష్యంగా INC హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈసారి AGP, UPPL, BPF పార్టీలతో కలిసి బీజేపీ, CPM, AJP, APHLCలతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగుతున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు గెలుచుకున్న AIUDF ఒంటరిగా బరిలో దిగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని సీఎం హిమంత, పదేళ్ల పాలనకు ముగింపు పలుకుతామని గౌరవ్ గొగొయ్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#Elections2026<<>>