News October 29, 2024

ఇవాళ ఉ.10 గంటల నుంచి ఫ్రీ గ్యాస్ బుకింగ్స్

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇవాళ ఉ.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. గ్యాస్ కనెక్షన్‌, రేషన్, ఆధార్ కార్డులు ఉన్నవారు గ్యాస్ డీలర్ వద్ద E-KYC చేయించుకోవాలి. పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్‌ను తీసుకుంటే 2 రోజుల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే టోల్‌ ఫ్రీ నంబర్ 1967కి ఫోన్ చేయాలి. మొదటి సిలిండర్‌ను మార్చి 31 లోపు, రెండోది జులై 31, మూడోది నవంబరు 30లోపు తీసుకోవచ్చు.

Similar News

News November 10, 2025

ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

image

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.

News November 10, 2025

మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

image

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్‌కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.