News October 23, 2024
ఉచిత గ్యాస్ సిలిండర్.. అమలు ఇలా..

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకొకటి ఇవ్వాలని నిర్ణయించింది. సిలిండర్కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ఆ సబ్సిడీ మొత్తం ఖాతాల్లో డిపాజిట్ కానుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.రూ.876 ఉండగా కేంద్రం సబ్సిడీ రూ.25 పోను మిగిలిన రూ.851 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.2,553 ఖాతాల్లో జమ కానున్నాయి.
Similar News
News December 2, 2025
శ్రీకాకుళం: ఈనెల 5న మెగా పేరెంట్స్ మీట్.!

ఈనెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్-3.0 ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. సోమవారం జెడ్పీ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. గతంలో నిర్వహించిన 2 పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
News December 2, 2025
టుడే టాప్ స్టోరీస్

* హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CM CBN
* CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత
*ప్రాజెక్టులకు తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి: CM రేవంత్
* TG: ‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్ యాప్’
* GHMCలో 27మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
* పదేళ్లలో రూ.34 లక్షల కోట్లు పెరిగిన విదేశీ అప్పు
*ఎయిపోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం
* పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు
News December 2, 2025
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు NMUA, ఎంప్లాయీస్ యూనియన్లకు సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి వివరించి పరిష్కారాల కోసం చర్చలు జరపవచ్చు.


