News September 18, 2024

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్‌ను అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 28, 2025

2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.

News November 28, 2025

అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: నారాయణ

image

AP: అమరావతిలో రైల్వేస్టేష‌న్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోస‌మే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెంద‌దని.. అందుకే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ క‌ట్టాల‌ని సీఎం నిర్ణ‌యించార‌న్నారు. గ‌తంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎక‌రాలు మాత్ర‌మే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎక‌రాలు ఇచ్చామని వివరించారు.

News November 28, 2025

డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

image

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.