News November 1, 2024
ఫ్రీ గ్యాస్.. నేడే ప్రారంభం

AP: ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తారు. కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్ను తీసుకుంటే 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం జమ చేస్తుంది.
Similar News
News December 6, 2025
వ్యూహ లక్ష్మి పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలి?

శ్రీవారి హృదయస్థానంలో వెలసిన వ్యూహ లక్ష్మి అమ్మవారిని పసుపు ముద్రతో అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం తర్వాత, తొలగించిన పాత పసుపును భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీవారి ప్రత్యేక సేవల్లో, అభిషేకంలో పాల్గొనే భక్తులకు ఈ పవిత్ర పసుపు లభిస్తుంది. ఈ ప్రసాదం పొందిన వారికి సిరిసంపదలకు లోటు ఉండదని విశ్వాసం. వ్యూహ లక్ష్మి అమ్మవారికి 3 భుజాల ఉండటం వల్ల త్రిభుజ అని కూడా పిలుస్తారు.
News December 6, 2025
రైళ్లలో వారికి లోయర్ బెర్తులు: కేంద్ర మంత్రి

రైళ్లలో వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎంచుకోకున్నా, అందుబాటును బట్టి ఆటోమేటిక్గా కింది బెర్తులు వస్తాయని అన్నారు. స్లీపర్, 3AC బోగీల్లో కొన్ని బెర్తులను పెద్దలు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు కేటాయించినట్లు రాజ్యసభలో తెలియజేశారు. రైళ్లలో దివ్యాంగులు, సహాయకులకూ ఇలానే కొన్ని రిజర్వ్ చేసినట్లు చెప్పారు.
News December 6, 2025
ఉద్యోగులకు ఆ హక్కు ఉండాలి.. లోక్సభలో బిల్లు

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులకు వచ్చే ఆఫీసు కాల్స్కు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ‘Right to Disconnect Bill-2025’ను NCP ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. పని వేళల తర్వాత, హాలిడేస్లో వర్క్ కాల్స్, ఈమెయిల్స్ నుంచి డిస్ కనెక్ట్ అయ్యే హక్కు ఉద్యోగులకు ఉండాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.


