News September 14, 2024

నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు

image

TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News February 18, 2026

వంగలో ఆకుమాడు తెగులు – నివారణ

image

వంగ పంటలో నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఆకుమాడు తెగులు ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాగే గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి, వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

News February 18, 2026

T20 WC: పాక్ ఓడితే ఇంటికే!

image

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు సౌతాఫ్రికా-UAE, 3PMకు పాకిస్థాన్-నమీబియా, 7PMకు ఇండియా- నెదర్లాండ్స్ తలపడనున్నాయి. నేటి మ్యాచ్‌లో పాక్ గెలిస్తే S-8కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం రన్ రేట్ ఆధారంగా USAకు అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, జింబాబ్వే S-8కు వెళ్లాయి.

News February 18, 2026

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వేళాయే

image

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. 25న తిరుకళ్యాణం, 26న దివ్య విమాన రథోత్సవం వంటి కీలక ఘట్టాలు నిర్వహిస్తారు. 28న గర్భాలయంలోని మూలవిరాట్టుకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఇప్పటికే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.