News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
Similar News
News October 22, 2025
రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.
News October 22, 2025
RMLIMSలో 422 నర్సింగ్ పోస్టులు

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (RMLIMS) 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో దరఖాస్తు లింక్ ఓపెన్ కానుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drrmlims.ac.in/
News October 22, 2025
నిందితుడికి మా పార్టీలో ఏ పదవీ లేదు: TDP

AP: కాకినాడ(D) తునిలో స్కూల్ నుంచి బాలికను తోటలోకి తీసుకెళ్లిన <<18071366>>ఘటనపై<<>> టీడీపీ స్పందించింది. ‘సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలోనూ నిందితుడికి ఏ పదవీ లేదు. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు’ అని ట్వీట్ చేసింది.