News December 18, 2024
జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్సుంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.
Similar News
News February 5, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒప్పుకోని ‘AAP’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.
News February 5, 2025
కారు యజమానులకు GOOD NEWS!
నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.
News February 5, 2025
ఈ నెల 10న కొడంగల్లో BRS రైతు దీక్ష
TG: సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఈ నెల 10న బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించనుంది.