News September 4, 2024
రైతులకు ఫ్రీగా పంప్ సెట్‌లు: సీఎం రేవంత్

TG: రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి. వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. రైతులకు సోలార్ పంప్ సెట్‌లు ఫ్రీగా ఇవ్వాలి. మిగులు విద్యుత్‌పై ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేయాలి. కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలి’ అని విద్యుత్ శాఖపై సమీక్షలో CM ఆదేశించారు.
Similar News
News February 6, 2026
శుక్ర జపం ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటి?

శుక్ర జపాన్ని ప్రశాంత ప్రదేశంలో చేయాలి. వీలైతే తెల్లని దుస్తులు ధరించాలి. ఇందుకు ఉదయం/సాయంత్రం వేళలు అనుకూలం. కళ్లు మూసుకుని మంత్రాన్ని శ్రద్ధగా పఠించాలి. 108 పూసల జపమాల ఉంటే దాని సాయంతో వాటిని లెక్కిస్తూ జపించాలి. ఈ సాధనతో అంతర్గత మార్పు మొదలవుతుంది. క్రమంగా నిర్ణయాలు మెరుగుపడతాయి. బంధాలు బలపడతాయి. ఈ ప్రక్రియ మనల్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. బయట ప్రపంచపు ఆనందాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది.
News February 6, 2026
ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశం: ట్రంప్

ప్రపంచంలోనే అమెరికా శక్తిమంతమైన దేశమని డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. తన మొదటి పదవీకాలంలో కొత్త, పునరుద్ధరించిన అణ్వాయుధాలతో మిలిటరీని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఇరాన్‌తో చర్చల నేపథ్యంలో చాలా కాలం పాటు నిలిచే ఉండేలా అధునాతన, నూతన ఒప్పందంపై న్యూక్లియర్ నిపుణులు పనిచేయాలన్నారు. భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధాలను ఆపినట్లు మరోసారి గొప్పలు చెప్పారు.
News February 6, 2026
రంగులు మారే శివలింగం.. ఎక్కడంటే?

తమిళనాడులోని తంజావూరు(D), నల్లూర్‌లో ఉన్న కల్యాణ సుందరేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని శివలింగం రోజుకు 5 రంగులు (నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ) మారుతాయి. 1,000 ఏళ్ల చరిత్ర గల ఈ క్షేత్రంలో శివుడిని, మురుగన్‌ను కొలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో బంగారంతో అలంకరించిన శివలింగం ఉంటుంది. ప్రవేశ ద్వారం వద్ద గంధపు అభిషేకం చేసే మరో లింగం ఉంటాయి.


