News July 9, 2024
ఉచిత ఇసుక దుమారం.. ముంచేదెవరినో?

AP: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన <<13589572>>ఉచిత<<>> ఇసుక విధానంపై దుమారం చెలరేగుతోంది. తమ హయాంలోనే తక్కువ ధరకు ఇసుక ఇచ్చామంటూ <<13593990>>YCP<<>>, కాదు మేమే తగ్గించామని <<13593700>>కూటమి<<>> శ్రేణులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఆధారాలతో పోస్టులు చేస్తున్నాయి. ఇసుక ఫ్రీ అని చెప్పి ఈ ధరలేంటని YCP ప్రశ్నిస్తోంది. అవి తవ్వకం, రవాణా ఛార్జీలని కూటమి నేతలు చెబుతున్నారు. ఓవరాల్‌గా ఉచిత ఇసుక విధానంపై మీ కామెంట్?
Similar News
News March 22, 2026
రేషన్‌కార్డుదారులకు రేపటి నుంచి కిరోసిన్

AP: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల(ఒక కిలో లీటర్= వెయ్యి లీటర్లు) కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. APని కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
News March 22, 2026
SRH బౌలింగ్ వెరీ వీక్: అభినవ్

SRH బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉన్నప్పటికీ బౌలింగ్ వీక్ అని మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. ‘బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్ ఉంటే బౌలింగ్‌కు 1/10 మాత్రమే. జయ్‌దేవ్, హర్షల్‌పైనే పేస్ భారం ఉంది. మిగతా వాళ్లకు అనుభవం లేదు. టాలెంటెడ్ పేసర్లు ప్రఫుల్, ఓంకార్, షకీబ్ ఉన్నప్పటికీ ఒక్క మ్యాచూ ఆడలేదు. వేలంలో స్పెషలిస్టు బౌలర్లను కాకుండా లివింగ్‌స్టోన్‌ను కొనడం ఆశ్చర్యం కలిగించింది’ అని పేర్కొన్నారు.
News March 22, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’.. మూడో రోజు కలెక్షన్లు ఇవే

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 3 రోజుల్లో రూ.63.08 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు Sacnilk వెల్లడించింది. మొత్తంగా రూ.53.90 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. మూడో రోజు శనివారం 36 శాతం ఆక్యుపెన్సీతో రూ.9.15 కోట్లు(నెట్) వసూలైనట్లు పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. బాక్సాఫీస్ వసూళ్లపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.


