News July 6, 2024
ఉచిత ఇసుక విధానం.. కీలక పరిణామం

AP: రాష్ట్రంలోని రీచ్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టర్లుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇవాళ, రేపట్లో ఉచిత ఇసుక విధానంపై ఉత్తర్వులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించనున్నారు. సీనరేజ్ ఛార్జి టన్నుకు రూ.88, రవాణా ఖర్చు, జీఎస్టీ 18% కలిపి ధరలను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
Similar News
News December 4, 2025
శ్రీరాంపూర్: ఈ నెల 8న అప్రెంటిస్ట్ మేళా

ఈ నెల 8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ శ్రీరాంపూర్ ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. అప్రెంటిషిప్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఫ్రెండ్షిప్ మేళాలో పాల్గొనాలన్నారు. అర్హత గలవారు www.apprenticeshipindia.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
News December 4, 2025
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్(73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని లోధి రోడ్డులో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది. సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ గతంలో మిజోరం గవర్నర్గా పనిచేశారు. కాగా 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. సుష్మా-కౌశల్ దంపతులకు బన్సూరి స్వరాజ్ అనే కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా సేవలందిస్తున్నారు.
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.


