News July 9, 2024

ఉచిత ఇసుక పాలసీ సంతోషకరం: పురందీశ్వరి

image

AP: గత ప్రభుత్వం చేసిన ఇసుక దోపిడీ ముసుగు తొలగించామని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి చెప్పారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై CBI విచారణ జరిపించాలని ఇప్పటికే CM చంద్రబాబును కోరామని తెలిపారు. ప్రజలకు మేలు చేసేలా ఉచిత ఇసుక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకురావడం సంతోషకరమని, దీన్ని పారదర్శకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఇసుక ర్యాంప్‌‌ను మంత్రి దుర్గేశ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

Similar News

News March 31, 2026

BIG ALERT: వడగళ్ల వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల <<19520557>>వర్షాలు<<>> కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటలలోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.

News March 31, 2026

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం

image

భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆయన బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. అయితే పేస్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో ఆయన TMCలో చేరి తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు.

News March 31, 2026

ప్రభాస్ బిజీబిజీ.. ఈ ఏడాదే ‘ఫౌజీ’?

image

‘రాజాసాబ్’ డ్యామేజ్ నుంచి బయటపడేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ‘ఫౌజీ’పై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఈ ఏడాదే రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీంతోపాటు ‘కల్కి-2’, ‘స్పిరిట్’ సినిమాల షూటింగ్స్‌లోనూ పాల్గొంటూ ఆయన బిజీగా ఉంటున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.