News October 25, 2024
ఉచిత ఇసుక పాలసీ.. కీలక ఉత్తర్వులు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని మరింత సులభతరం చేసింది. సీనరేజీ ఫీజు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా సీనరేజీ ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో స్థానికంగా ఇసుక లభ్యత, రవాణా పెరుగుతుందని తెలిపింది.
Similar News
News January 8, 2026
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.
News January 8, 2026
కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి!

తన కొడుకు అగ్నివేశ్(49) <<18794363>>ఆకస్మిక మరణం<<>> నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని తెలిపారు. ‘ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని కలలు కన్నాం. మేం ఆర్జించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశా’ అని చెప్పారు.
News January 8, 2026
తిరుమల: 3 రోజులు SSD టోకెన్లు నిలిపివేత

AP: తిరుమలలో ఈనెల 25న రథసప్తమి సందర్భంగా 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు SSD టోకెన్ల జారీ నిలిపేయనున్నట్లు TTD తెలిపింది. 25న ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొంది. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈనెల 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమంది. NIRలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ ఆ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు చెప్పింది.


